మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..............

Tidak ada komentar:
Posting Komentar